: కీలక భేటీ జరిగేనా?... 19న భేటీకి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్, 21న అయితే ఓకే అన్న కేసీఆర్!
తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణల మధ్య నెలకొన్న జల జగడానికి చెక్ పెట్టేందుకు కేంద్రం రూపొందించిన కార్యాచరణ ప్రణాళికకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబునాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు భిన్నంగా స్పందించారు. ఇరు రాష్ట్రాల సీఎంల మధ్య ముఖాముఖి భేటీతోనే ఈ వివాదానికి తెర వేయొచ్చని కేంద్రం భావించింది. ప్రధానమంత్రిత్వ కార్యాలయం ఆదేశాలతో రంగంలోకి దిగిన కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతి సదరు భేటీకి ప్రణాళిక రూపొందించారు. ఈ నెల 11, 18, 19 తేదీల్లో మీకు అనుకూలమైన తేదీలను తెలపాలంటూ రెండు రాష్ట్రాలకు జలవనరుల శాఖ కార్యదర్శి లేఖలు రాసిన సంగతి తెలిసిందే. ఈ లేఖకు సానుకూలంగా స్పందించిన చంద్రబాబు... ఈ నెల 19న రావడానికి తాను సిద్ధమేనని కేంద్రానికి తెలిపారు. అయితే కేసీఆర్ అందుకు భిన్నంగా స్పందించారు. కేంద్రం ప్రతిపాదించిన మూడు తేదీలను కాకుండా, ఈ నెల 21న భేటీ నిర్వహించేటట్లయితే తాను హాజరుకాగలనని తెలిపారు. దీనిపై కేంద్రమంత్రి ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి!