: లుంగీ ధరించిన సచిన్!... పక్కనే చిరంజీవి, నాగార్జున!
ప్రముఖ క్రికెటర్, భారతరత్న సచిన్ టెండూల్కర్ నిన్న సరికొత్త వస్త్రధారణలో కనిపించారు. కేరళలోని కొచిలో లుంగీ, టీ షర్టులో కనిపించిన ఆయన పక్కనే అదే వస్త్రధారణలో టాలీవుడ్ ప్రముఖ నటులు మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జునలు కూడా దర్శనమిచ్చారు. అయితా ఈ ముగ్గురు ఎలా కలిశారనేగా?... ఇండియన్ సాకర్ లీగ్ (ఐఎస్ఎల్) టోర్నీ వచ్చే నెల 1 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో కేరళ బ్లాస్టర్స్ పేరిట ఓ జట్టు రంగంలోకి దిగబోతోంది. ఈ జట్టుకు సచిన్ తో పాటు చిరు, నాగ్ లు యజమానులుగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈ ముగ్గురు నిన్న కొచిలో సదరు జట్టు సభ్యులను ప్రకటించిన సందర్భంగా లుంగీలు కట్టి మలయాళీల మాదిరి కనిపించారు.