: పవన్ కూడా చూసే ఉంటారుగా!...‘ప్యాకేజీ’పై జనసేనాధిపతి ఎలా స్పందిస్తారో చూద్దామన్న చంద్రబాబు!
ఏపీకి ప్రత్యేక ప్యాకేజీకి సంబంధించి నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి చేసిన ప్రకటన తర్వాత విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన టాలీవుడ్ అగ్ర నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేరును కూడా ప్రస్తావించారు. ‘‘పవన్ కల్యాణ్ మొన్న మాట్లాడారు. ఈ రోజు ఆయన కూడా కేంద్ర మంత్రుల ప్రకటన చూసే ఉంటారు. ఆయన ఇప్పుడు ఏం మాట్లాడతారో... ఎలా స్పందిస్తారో చూద్దాం. రాష్ట్రాభివృద్ధికి ఎవరు సహకరించినా నాకు ఓకే’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.