: దేశంలోనూ తుపాకీ సంస్కృతి


అమెరికాలో తరచుగా కాల్పులు జరగడం ప్రపంచానికి తెలుసు. అక్కడ చిన్నారులకు కూడా తుపాకులు అందుబాటులో ఉంటాయి మరి. పాశ్చాత్య ధోరణుల వెంట అడుగులు వేస్తున్న భారత్ లో అదే తుపాకుల సంస్కృతి దిగుమతి అయినట్లుగా కనిపిస్తోంది. ఢిల్లీల్లో ఫామ్ హౌస్ లో కాల్పులు రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త చద్దా, బిఎస్ పి నేతను గత ఐదు నెలల కాలంలో బలితీసుకున్న సంగతి తెలిసిందే. ఇలాంటివి తరచుగా వింటూనే ఉన్నాం.

ఇక ఆమధ్య ఢిల్లీలోని ఒక పాఠశాలలో కాల్పుల ఘటన గుర్తుండే ఉంటుంది. తాజాగా 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని హర్యానాలో క్లాస్ మేటే కాల్చి చంపాడు. రోహ్ తక్ లో ఒక వేడుకకు హాజరైన విద్యార్థి నితిన్ అక్కడ తన మిత్రుడు అంకుర్ ను మరొక వర్గం వారు వేధిస్తుంటే అడ్డుకున్నాడు. దాంతో వివాదం మొదలైంది. ప్రత్యర్థి వర్గంలోని ఒక బాలుడు ఇంట్లోకి వెళ్లి తుపాకీ తీసుకొచ్చి నితిన్ ను కాల్చేశాడు.

  • Loading...

More Telugu News