: ఏపీకి ప్రత్యేక ప్యాకేజ్ పై ఉత్కంఠ రేపుతున్న ఢిల్లీ పరిణామాలు!
ఏపీకి ప్రత్యేక ప్యాకేజ్ అంశంపై ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి. రాష్ట్రానికి ఇచ్చే ప్యాకేజ్ పై ఇంకా సస్పెన్స్ వీడలేదు. ఈ రోజు ఉదయం నుంచి కేంద్ర, రాష్ట్రాల మద్య నిరంతర సంప్రదింపులు కొనసాగుతున్నాయి. ఈ అంశంపై అరుణ్ జైట్లీ స్పష్టత ఇచ్చే అవకాశాలున్నట్లు సమాచారం. ఈరోజు రాత్రి 8 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ప్యాకేజ్ కు తుదిరూపుపై జైట్లీ అధికారులతో కలిసి చర్చిస్తున్నారు. ప్యాకేజ్ కు సంబంధించి ఏపీ ప్రభుత్వం లేవనెత్తుతున్న పలు అంశాలను కేంద్రమంత్రి సుజనా చౌదరి కేంద్రం ముందు ఉంచుతున్నారు. ఈ విషయమై ఆర్థిక మంత్రిత్వ శాఖతో మంత్రి సుజనా చౌదరి, ఎంపీ సీఎం రమేష్ చర్చలు జరుపుతున్నారు. కాగా, మరోవైపు ఏపీకి ప్యాకేజ్ పై మంత్రవర్గ సహచరులు, అధికారులతో సీఎం చంద్రబాబు చర్చిస్తున్నారు.