: నా ఆరాధ్యనటుడితో కలిసి పనిచేసే సమయం కోసం ఎదురుచూస్తున్నా: అమీర్ ఖాన్
‘నా ఆరాధ్య నటుడు అమితాబ్ బచ్చన్ తో కలిసి నటించే సమయం సమీపించింది’ అని బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ అన్నారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. ‘థగ్స్ ఆప్ హిందూస్థాన్’ అనే చిత్రంలో అమితాబ్ తో కలిసి తాను నటిస్తున్నానని, తన ఆరాధ్య నటుడితో కలిసి పనిచేయనున్న తనకు చాలా థ్రిల్ గా ఉందని అన్నారు. వచ్చే ఏడాది మొదట్లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుందని, దీపావళి-2018 కి దీనిని విడుదల చేస్తామని అన్నారు. ఈ చిత్రం షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందా అని ఎదురుచూస్తున్నానని ఆ ట్వీట్ లో అమీర్ ఖాన్ పేర్కొన్నారు. కాగా, యశ్ రాజ్ ఫిల్మ్స్ బేనర్ పై తెరకెక్కనున్న ఈచిత్రానికి కథ, దర్శకత్వం విజయ్ కృష్ణ. ఈ చిత్రంలో హీరోయిన్ ను త్వరలో ప్రకటించనున్నారు.