: శంషాబాద్ ఎయిర్ పోర్టులో బుల్లెట్ కలకలం
హైదరాబాదులోని శంషాబాద్ ఎయిర్ పోర్టులో బుల్లెట్ కలకలం రేపింది. హైదరాబాదు నుంచి దుబాయ్ వెళ్తున్న రవిబాబు అనే వ్యక్తి వద్ద తుపాకీ లభ్యం కావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే అతనిని అదుపులోకి తీసుకున్నారు. ఆయనపై కేసు నమోదు చేసి, విచారణ ప్రారంభించారు. ఆయనకు ఆ బుల్లెట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా వచ్చింది? బుల్లెట్ ను విమానంలోకి తీసుకెళ్లడం వెనుక కారణాలేంటి? తదితర అంశాలపై ఆయనను ప్రశ్నిస్తున్నారు.