: ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలంతా ఏకమై సౌదీ అరేబియాకి గట్టిగా బుద్ధి చెప్పాలి: ఇరాన్ అధ్యక్షుడి తీవ్ర వ్యాఖ్యలు
భద్రతా కారణాల నేపథ్యంలో ఇరాన్ దేశీయులను హజ్ యాత్రకు రానివ్వకుండా నిషేధించడం పట్ల ఇరాన్ అధ్యక్షుడు హస్సాన్ రౌహీని ఆగ్రహం వ్యక్తం చేశారు. సౌదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై కేబినేట్ సమావేశంలో మాట్లాడిన ఆయన.. తమ దేశీయులను అనుమతించని సౌదీ అరేబియా గవర్నమెంటుని శిక్షించాలని ఆయన అన్నారు. ఇరాన్ చుట్టూ ఉన్న దేశాలే కాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు అందరూ ఏకమై ఆ దేశ సర్కారుకి గట్టిగా బుద్ధి చెప్పాలని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు, సౌదీ అరేబియా గవర్నమెంట్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని, ఇరాక్, సిరియా, యెమెన్‌ల దేశాల్లో అందుకే దారుణ పరిస్థితులు ఏర్పడ్డాయని హస్సాన్ రౌహీని వ్యాఖ్యలు చేశారు. గత ఏడాది హజ్ యాత్రకు వెళ్లిన ఇరాన్ దేశీయులు వందలాది మంది మరణించిన అంశంపై ఆయన స్పందిస్తూ దానికి కూడా ఆ దేశ ప్రభుత్వమే కారణమని అన్నారు. ఇరాన్ అధ్యక్షుడి వ్యాఖ్యలపై సౌదీ అరేబియా సీరియస్‌గా ఉంది.