: నలభై ఐదేళ్లుగా నేను సుష్మానే 'ఫాలో' అవుతున్నా!: సుష్మా స్వరాజ్ భర్త చమత్కారం!
సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు చేరువగా ఉండే కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ కు ట్వీట్లు పుష్కలంగా వస్తుంటాయి. తమకు సాయం చేయాలని ఒకరు, సలహా ఇవ్వమని మరొకరు, వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ మరొకరు... ఇలా పలురకాల ట్వీట్లు చేస్తూ వుంటారు. తాజాగా, శిశిర్ నాయక్ అనే ఒక వ్యక్తి నుంచి సుష్మాకు ఒక వెరైటీ ట్వీట్ వచ్చింది. ‘సుష్మా స్వరాజ్ జీ, మీ భర్త కౌశల్ స్వరాజ్ ట్విట్టర్లో మిమ్మల్ని ఫాలో అవుతున్నారు. మీరు మాత్రం ఆయనను ఫాలో కావడం లేదు. ఎంతో వినయంగా అడుగుతున్నాను.. ఎందుకని?’ అంటూ ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. అయితే, ఈ ట్వీట్ కు సుష్మాకు బదులు ఆయన భర్త కౌశల్ స్వరాజ్ స్పందిస్తూ, తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ‘నేను ఆమెను 45 ఏళ్లుగా అనుసరిస్తున్నాను. ఇప్పుడు దీన్ని మార్చలేం’ అంటూ ఆయన చమత్కారంతో కూడిన ట్వీట్ చేశారు.