: సొంత దేశ ప్రధాని పేరు చెప్పలేకపోయిన ముద్దుగుమ్మ.. అయినప్పటికీ 'మిస్ ఉక్రెయిన్' కిరీటం దక్కించుకుంది!


మిస్ ఉక్రెయిన్‌ టైటిల్‌ని ఎగరేసుకుపోవ‌డానికి పోటీలో నిలిచి గెలిచిన ఓ భామ ఆ పోటీల‌ నిర్వాహకుల‌ను తీవ్ర ఆశ్చ‌ర్యానికి గురిచేసింది. నిర్వాహ‌కులు అడిగిన సాధారణ ప్రశ్నకి సమాధానం చెప్పలేక ఆమె తెల్ల‌మొహం వేసింది. అందాలొలికించిన భామ అలెగ్జాండ్రా కుచెరెంకో (18) పరిస్థితిని చూసి ఆశ్చర్యపోవడం అందరివంతయింది. ఉక్రెయిన్ ప్రధాని పేరు ఏంటో చెప్పమ‌ని నిర్వాహకులు అడిగితే ఆమె ఆ స‌మాధానం తెలియక అలాగే మౌనంగా ఉండిపోయింది. పైపెచ్చు టెన్ష‌న్‌కు గురైంది. చివ‌రికి తాను ఆ సమాధానం చెప్పలేనని చెప్పేసింది. సొంత దేశ ప్రధాని పేరు తెలియకపోవడంపై నిర్వాహ‌కులు మొద‌ట‌ ఆశ్చ‌ర్య‌పోయారు. ప్రధాని వోలోదిమిర్ గ్రోయిస్మాన్ పేరును ఆమె చెప్పలేకపోయిన‌ప్ప‌టికీ పోటీల్లో అలెగ్జాండ్రాకే మిస్ ఉక్రెయిన్ కిరీటం ద‌క్క‌డం కొసమెరుపు.

  • Loading...

More Telugu News