: సల్మాన్ ఇంట ఎప్పటిలానే గణపతి పూజ!


ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు వినాయక చవితి అంటే చాలా ఇష్టం. తాను ఒక మతానికి చెందిన వాడిని కానని, 'భారతీయుడి'నని గర్వంగా చెప్పుకునే సల్మాన్ ఖాన్... ప్రతి ఏటా వినాయక చవితి సందర్భంగా తన ఇంట్లో గణేషుడి విగ్రహం ఏర్పాటు చేస్తాడు. దీనికి మూడు రోజులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తాడు. ఈ సందర్భంగా బాలీవుడ్ ప్రముఖులంతా సల్మాన్ ఇంట కొలువైన గణనాథుడిని కొలిచేందుకు క్యూ కడతారు. చివరి రోజున అంగరంగ వైభవంగా నిమజ్జన కార్యక్రమం నిర్వహిస్తాడు. ఈ సందర్భంగా అందరితోనూ సరదాసరదాగా గడుపుతాడు. మంచి పార్టీ ఇస్తాడు. అలాంటిది ఈసారి సల్మాన్ ఇంట్లో లేకుండానే ఆయనింట వినాయక చవితి వేడుక జరిగిపోయింది. అయినప్పటికీ సల్మాన్ నివాసానికి బాలీవుడ్ స్టార్లు క్యూకట్టారు. నిమజ్జన కార్యక్రమాన్ని సల్మాన్ సోదరుడు సోహైల్ ఖాన్ పూర్తి చేశాడు. కాగా, సల్మాన్ ఖాన్ లడఖ్ లో కొత్త సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.

  • Loading...

More Telugu News