: తిరుపతి ఎయిర్ పోర్టులో ఆర్డీఎక్స్... తరలిస్తున్న నలుగురి అరెస్ట్


తిరుపతి సమీపంలోని రేణిగుంట విమానాశ్రయంలో తరలిస్తున్న అత్యంత ప్రమాదకర పేలుడు రసాయనం లిక్విడ్ ఆర్డీఎక్స్ పట్టుబడటం సంచలనం కలిగిస్తోంది. ఈ మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లాల్సిన విమానంలో దీన్ని తరలిస్తున్న నలుగురిని భద్రతా దళాలు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానంలో దీన్ని తరలించేందుకు యత్నిస్తుండగా, తనిఖీల్లో అనుమానం వచ్చిన సిబ్బంది, అది ద్రవరూప ఆర్డీఎక్స్ గా తెలుసుకుని షాక్ తిన్నారు. ఈ నలుగురు ఎవరన్న విషయాన్ని పోలీసులు విచారిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

  • Loading...

More Telugu News