: ప్రత్యేక హోదాపై మా వైఖరిని రాజ్యసభలో చెప్పేశాం: కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్
ఆంధ్రప్రదేశ్‌కి ప్యాకేజీపై కేంద్రం నుంచి ఓ ప్రకటన వస్తుందని వార్తలు వస్తుండగా మరోవైపు ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ నుంచి నిరసనలతో కూడిన డిమాండులు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశంపై కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ నేడు ఢిల్లీలో స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌కి హోదాపై తమ వైఖరిని ఇప్పటికే రాజ్యసభలో చెప్పేశామని ఆమె అన్నారు. కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు హోదా అంశంపై సమాధానం కూడా చెప్పారని ఆమె గుర్తు చేశారు. అయినప్పటికీ ఏపీకి ప్రత్యేక హోదాపై ఢిల్లీలో చర్చిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలను అమలు పరుస్తామని ఆమె అన్నారు.