: ఎమ్మెల్యే అక్బ‌రుద్దీన్‌పై హ‌త్యాయ‌త్నం కేసులో వాంగ్మూలం న‌మోదు చేసిన న్యాయ‌స్థానం


ఎంఐఎం నేత‌, చంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీపై కొన్ని సంవ‌త్స‌రాల క్రితం హైద‌రాబాద్‌ పాతబస్తీలోని బార్కాస్ ప్రాంతంలో హత్యాయత్నం జరిగిన కేసులో నాంపల్లి న్యాయస్థానం ఈరోజు కూడా విచారణ జ‌రిపింది. అక్బరుద్దీన్ వాంగ్మూలాన్ని కోర్టు న‌మోదు చేసుకుంది. అనంత‌రం కేసును రేప‌టికి వాయిదా వేసింది. నిన్న అక్బరుద్దీన్ త‌న‌పై హత్యాయత్నం చేసిన 13 మందిని న్యాయ‌స్థానంలో గుర్తించి పాక్షిక వాంగ్మూలం ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. అక్బ‌రుద్దీన్ త‌న‌పై ప్ర‌త్య‌ర్థులు క‌త్తులు, తుపాకుల‌తో దాడికి దిగిన తీరును న్యాయ‌స్థానానికి వివరించారు.

  • Loading...

More Telugu News