: నేను గెలిస్తే వైట్ హౌస్ లో మొదటిరోజు 'ఇలా' చేస్తానంటున్న ట్రంప్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను కనుక గెలిస్తే వైట్ హౌస్ లో మొదటి రోజు ఇలా బిజీబిజీగా ఉంటుందంటున్నారు డొనాల్డ్ ట్రంప్. నార్త్ కరోలినా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ట్రంప్ తాను గెలుపొందితే కనుక తొలిరోజు ఎలా ఉండబోతోందనే విషయాన్ని ప్రస్తావించారు. మొదటిరోజు శ్వేతసౌథంలోకి అడుగుపెట్టగానే ... ఒబామా ప్రభుత్వంలోని పలు ప్రమాదకరమైన పాలసీలను రద్దు చేస్తానని, ఒబామాకేర్, ఒబామా ఎగ్జిక్యూటివ్ ఆదేశాల రద్దు, ఎన్ఎఫ్టీఏ కోసం పున:సంప్రదింపులకు ఆదేశాలు జారీ చేయడం, సిరియా శరణార్థుల పునరావాస చర్యలను నిలిపివేయడం తదితర మార్పులు చేయనున్నట్లు ట్రంప్ చెప్పారు. మెక్సికోతో సరిహద్దులో గోడ కట్టే అంశంపై చర్యలు ప్రారంభిస్తామని, తద్వారా డ్రగ్స్ మాఫియాను అరికడతామని ట్రంప్ పేర్కొన్నారు.