: మంచిరెడ్డిపై సిట్ చేత విచారణ చేయించండి!...తెలంగాణ డీజీపీకి మల్ రెడ్డి ఫిర్యాదు!


గ్యాంగ్ స్టర్ నయీమ్ తో ఇబ్రహీపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డికి సంబంధాలున్నాయంటూ ఆరోపణలు చేసిన కాంగ్రెస్ పార్టీ నేత, మలక్ పేట మాజీ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి కొద్దిసేపటి క్రితం మరో అడుగు ముందుకేశారు. కాసేపటి క్రితం ఆయన నేరుగా తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మతో భేటీ అయ్యారు. నయీమ్ తో మంచిరెడ్డికి సంబంధాలున్నాయని, దానిపై సిట్ చేత విచారణ చేయించాలని ఆయన డీజీపీకి ఫిర్యాదు చేశారు. నయీమ్ తో సంబంధాలు నెరపిన మంచిరెడ్డి హైదరాబాదు నగర శివార్లలో పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టారని కూడా ఆయన డీజీపీకి అందించిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News