: ‘హోదా’కు తప్పించి దేనికీ ఆమోదం తెలపలేదు!... ఢిల్లీకి వస్తానని కూడా చెప్పలేదు!: చంద్రబాబు కీలక వ్యాఖ్యలు


ఏపీకి కేంద్రం నేడు ప్రకటిస్తుందని భావిస్తున్న స్పెషల్ డెవలప్ మెంట్ ప్యాకేజీపై టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కొద్దిసేపటి క్రితం కీలక వ్యాఖ్యలు చేశారు. అందుబాటులో ఉన్న మంత్రులతో నేటి ఉదయం విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో అత్యవసరంగా ఏర్పాటు చేసిన భేటీ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన తన వైఖరిని కుండబద్దలు కొట్టారు. ‘ప్రత్యేక హోదా తప్ప ఏ ఇతర అంశానికి నేను ఆమోదం తెలపలేదు. ప్రత్యేక ప్యాకేజీ కేంద్రం నుంచి వస్తున్న ప్రతిపాదన మాత్రమే. ప్యాకేజీకి నేను ఆమోదం తెలపలేదు. ఢిల్లీకి వస్తానని కూడా నేను చెప్పలేదు. ప్యాకేజీలోని అంశాలు ముందుగా మా దృష్టికి వస్తే... మా వైఖరి వెల్లడించగలుగుతాం. ప్యాకేజీ వివరాలు మీడియా లీకేజీల వల్లే తెలుస్తున్నాయి. ప్యాకేజీ ప్రతిపాదన స్పష్టంగా ముందుకు వస్తే వైఖరి వెల్లడిస్తాం’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News