: బాబు గారూ... ప్యాకేజీకి ఒప్పుకోవద్దు!: ఏపీ సీఎంకు రఘువీరా సూచన


ఏపీకి స్పెషల్ డెవలప్ మెంట్ ప్యాకేజీని కేంద్రం ప్రకటిస్తుందని భావిస్తున్న తరుణంలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుకు ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఓ కీలక సూచన చేశారు. ప్రత్యేక హోదా లేని ప్యాకేజీకి ఎంతమాత్రం ఒప్పుకోవద్దని ఆయన సీఎంను కోరారు. ఒకవేళ ఢిల్లీకి వెళితే ప్రత్యేక హోదా కోసమే పోరాడాలని ఆయన సూచించారు. ప్యాకేజీకి రాజీ పడొద్దని ఆయన సీఎంను కోరారు. ఈ మేరకు ఆయన ఓ ప్రైవేటు న్యూస్ ఛానెల్ తో కొద్దిసేపటి క్రితం మాట్లాడిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News