: హుక్కా సెంటర్ లో ధోనీ భార్య సాక్షి... వైరల్ అవుతున్న చిత్రం!
భారత క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మేనేజర్ అరుణ్ పాండే హుక్కా పీలుస్తున్న వేళ, అతనితో ధోనీ భార్య సాక్షి దిగిన ఓ ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. వయ్యారంగా నిలబడి అరుణ్ పాండే బుగ్గ గిల్లుతున్నట్టు కనిపిస్తున్న చిత్రాన్ని సాక్షి స్వయంగా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. వారం రోజుల క్రితం ఈ చిత్రాన్ని పోస్ట్ చేయగా ఈ చిత్రం వేల లైక్స్ తెచ్చుకుంది. నిత్యమూ సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తూ, తన కుటుంబానికి చెందిన అన్ని వివరాలను పంచుకునే సాక్షి, ఇటీవలి కాలంలో కొన్ని హద్దులను దాటుతోందన్న విమర్శలూ వస్తున్నాయి.