: రాజ్‌నాథ్‌, వెంక‌య్య‌ల‌తో ముగిసిన సుజ‌నా భేటీ.. హోదా అంశాన్ని మళ్లీ ఎన్డీసీకి పంపాలని యోచ‌న‌!


ఈరోజు మ‌ధ్యాహ్నం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి ప్ర‌త్యేక హోదాపై కాకుండా ప్రత్యేక ప్యాకేజీపై ఓ కీల‌క‌ ప్ర‌క‌ట‌న వ‌స్తుంద‌ని వార్తలు వ‌స్తోన్న నేప‌థ్యంలో టీడీపీ సీనియర్ నేత, కేంద్ర స‌హాయ‌ మంత్రి సుజనా చౌదరి స్పందించారు. ఢిల్లీలో కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, వెంకయ్య నాయుడుల‌తో చ‌ర్చించిన‌ అనంతరం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ... హోదాపై ఢిల్లీలో చర్చలు కొన‌సాగుతున్నాయ‌ని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదానే తాము కోరుతున్న‌ట్లు పేర్కొన్నారు. ఏపీకి హోదా అంశాన్ని మళ్లీ ఎన్డీసీ (జాతీయ అభివృద్ధి మండలి)కి పంపాలని కేంద్ర మంత్రులు యోచిస్తున్నార‌ని, అదే క‌నుక జ‌రిగితే పుణ్యకాలం కాస్తా అయిపోతుందని సుజనా పేర్కొన్నారు. విభజన చట్టంలో కేంద్రం పొందుప‌రిచిన‌ అంశాల అమలు, ఏపీ భవన్ విభజనల‌పై కేంద్ర‌మంత్రుల‌తో తాను చర్చించినట్లు ఆయ‌న తెలిపారు.

  • Loading...

More Telugu News