: నన్ను అరెస్ట్ చేస్తారేమో... భూమన నోట తొలిసారి 'అరెస్ట్' మాట!
తుని విధ్వంసం ఘటనలో సీఐడీ విచారణకు రెండో రోజు హాజరయ్యేందుకు వచ్చిన వైకాపా నేత భూమన కరుణాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సీఐడీ కార్యాలయంలోకి వెళ్లేముందు ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో వైకాపాను సమూలంగా నాశనం చేసేందుకు చంద్రబాబు సర్కారు కంకణం కట్టుకుందని, నేటి విచారణ తరువాత తనను అరెస్ట్ చేస్తారేమోనన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. కాపుల ఉద్యమంలో తనను బలిపశువును చేశారని ఆరోపించిన ఆయన, తనను అదుపులోకి తీసుకుంటారో లేదో తెలియదని, దేనికైనా తాను సిద్ధంగానే ఉన్నానని అన్నారు. కాగా, ఈ కేసులో భూమన నోటి వెంట తొలిసారిగా 'అరెస్ట్' మాట రావడంతో వైకాపా వర్గాల్లో కలకలం రేగుతోంది.