: టీజేఏసీ సంసద్ యాత్రకు కాంగ్రెస్ ఎంపీల స్నేహ హస్తం
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ 48 గంటల పాటు నిర్వహిస్తున్న సంసద్ యాత్రకు తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎంపీలు మద్దుతు ప్రకటించారు. ఇందుకోసం 48 గంటల పాటు పార్లమెంట్ ఆవరణలో దీక్ష చేస్తామని ఎంపీ పొన్నం ప్రభాకర్ ఢిల్లీలో మీడియాకు చెప్పారు. తెలంగాణపై కాంగ్రెస్ తన మాటను నిలబెట్టుకోవాలని కోరారు.