: ఢిల్లీలో మొదలైన గవర్నర్ల సమావేశం
రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల గవర్నర్ల సమావేశం ఈ ఉదయం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ప్రారంభమైంది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అధ్యక్షతన జరుగుతున్న ఈ కార్యక్రమానికి ప్రధాని మన్మోహన్ సింగ్, పలువురు అధికారులు హాజరయ్యారు. కాగా, ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఆదివారమే ఢిల్లీ చేరుకున్నారు.