: మోదీ పాక్ పర్యటన వార్తలు నిరాధారమే: విదేశాంగ శాఖ
పాకిస్థాన్ లో నవంబర్ లో జరిగే సార్క్ దేశాల సదస్సుకు ప్రధాని వెళ్లనున్నారని వచ్చిన వార్తలను విదేశాంగ శాఖ తోసిపుచ్చింది. ఈ వార్తలు నిరాధారమని, ప్రధాని పర్యటన గురించి ఇంత ముందుగానే నిర్ణయం తీసుకోబోమని విదేశాంగ శాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ వెల్లడించారు. సోమవారం నాడు కరాచీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న భారత హై కమిషనర్ గౌతమ్ బంబావాలే, సార్క్ సదస్సుకు ప్రధాని రానున్నారని వ్యాఖ్యానించడంతో, ఆ వార్తకు అటు పాకిస్థాన్ లో, ఇటు ఇండియాలో ప్రాచుర్యం ఏర్పడింది. దీనిపై విదేశాంగ శాఖ వివరణ ఇచ్చింది.