: బీజేపీ ఆఫీసుపై బాంబులు విసిరిన దుండగులు
కేరళ రాజధాని తిరువనంతపురంలో పలువురు గుర్తు తెలియని వ్యక్తులు చేసిన బాంబు దాడి కలకలం రేపింది. నిన్న అర్ధరాత్రి పలువురు దుండగులు ఆఫీసుపై బాంబులు విసిరి అక్కడి నుంచి పరారయ్యారు. అదృష్టవశాత్తు ఆఫీసులో ఉన్న బీజేపీ కార్యకర్తలకు ఎటువంటి ప్రమాదమూ జరగలేదు. అయితే, కార్యాలయం స్వల్పంగా ధ్వంసమైందని, ప్రధాన ద్వారం వద్ద అద్దాలు మాత్రమే పగిలాయని పోలీసులు పేర్కొన్నారు. బీజేపీ కేరళ చీఫ్ కుమనమ్ రాజశేఖరన్ పార్టీ కార్యాలయం నుంచి వెళ్లగానే ఈ దాడి జరిగిందని బీజేపీ శ్రేణులు పేర్కొన్నాయి. ప్రమాదం తప్పడంతో పార్టీ వర్గాలు ఊపిరిపీల్చుకున్నాయి.