: లక్షలాది మంది చిరుద్యోగులకు శుభవార్త... ఈఎస్ఐ పరిమితి రూ. 21 వేలకు పెంపు


దేశవ్యాప్తంగా కొత్తగా 50 లక్షల మందికి లబ్ధి కలిగేలా ఈఎస్ఐ పరిమితిని రూ. 21 వేలకు పెంచుతూ, కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం నెలకు రూ. 15 వేల వరకూ పొందుతున్నవారు ఈఎస్ఐ గొడుగు కింద ఉండగా, ఈ పరిమితిని మరో రూ. 6 వేలు పెంచాలని నిర్ణయించినట్టు ఈఎస్ఐసీ బోర్డు భేటీ అనంతరం కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ వెల్లడించారు. తొలుత ఈ పరిమితిని రూ. 25 వేలకు పెంచాలని ప్రతిపాదించామని, చివరికి రూ. 21 వేలకు పెంచామని ఆయన అన్నారు. పెరుగుతున్న ధరలు, వేతనాల వృద్ధి తదితరాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. 50 లక్షల మంది కొత్త ఉద్యోగులు, వారి కుటుంబాలను కూడా కలుపుకుంటే రెండు కోట్ల మందికి పైగా ఆరోగ్య బీమా పరిథిలోకి రానున్నారని ఆయన అన్నారు. ఉద్యోగి పనిచేస్తున్న సంస్థ కార్మికుని వేతనంలో 4.7 శాతాన్ని, దీనికి అదనంగా కార్మికుల వేతనం నుంచి 1.75 శాతాన్ని ఈఎస్ఐసీకి చెల్లించాల్సి వుంటుందని అన్నారు.

  • Loading...

More Telugu News