: బీజేపీతో వెళితే చిప్ప గతే!... చంద్రబాబును హెచ్చరించిన సినీ నటుడు శివాజీ!
ఏపీకి ప్రత్యేక హోదాను ఇచ్చేది లేదని తేల్చేసిన కేంద్రం... ప్రత్యేక ప్యాకేజీ మంత్రం పఠిస్తున్న నేపథ్యంలో టాలీవుడ్ నటుడు, ప్రత్యేక హోదా సాధన సమితి గౌరవాధ్యక్షుడు శివాజీ నేటి ఉదయం సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం వైఖరికి సరేనంటే భారీ నష్టం తప్పదంటూ ఆయన టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడును హెచ్చరించారు. రానున్న మునిసిపల్ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేస్తే ఉత్తరాంధ్రలో టీడీపీకి చిప్ప చేతికొస్తుందని ఆయన చెప్పారు. విశాఖ రైల్వే జోన్ తో లాభాలు వస్తాయన్న ఆయన... విజయవాడలో జోన్ ఏర్పాటు చేస్తే గొడవలు ఉత్పన్నమవుతాయని చెబుతూ ఆయన చంద్రబాబును ఈ మేరకు హెచ్చరించారు.