: నయీమ్ కేసులో కీలక అరెస్ట్!... రిమాండ్ కు రాజకీయ నేత సామ సంజీవరెడ్డి!
గ్యాంగ్ స్టర్ నయీమ్ కేసుకు సంబంధించి నిన్న తెలంగాణ సిట్ అధికారులు కీలక అడుగు వేశారు. గ్యాంగ్ స్టర్ తో అంటకాగిన రాజకీయ నేతలపై దృష్టి సారించిన సిట్... అందులో భాగంగా తొలి విడతగా రాజకీయవేత్తగా కొనసాగుతున్న సామ సంజీవరెడ్డిని నిన్న హైదరాబాదులోని పహాడీ షరీఫ్ లో అరెస్ట్ చేసింది. సంజీవరెడ్డిపై ఆర్మ్స్ యాక్ట్, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్, చీటింగ్, కిడ్నాప్ తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది. ఆ తర్వాత ఆయనను కోర్టులో హాజరుపరిచింది. న్యాయమూర్తి రిమాండ్ విధించడంతో పహాడీ షరీఫ్ పోలీసులు ఆయనను జైలుకు తరలించారు.