: పవన్ కల్యాణ్ ను మరోసారి గుర్తు చేసుకున్న మాజీ భార్య!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ని చూస్తే తనకు అసూయగా ఉంటుందని అంటోంది ఆయన మాజీ భార్య రేణుదేశాయ్. ఆ వివరాల్లోకి వెళితే, గతంలో తాను తీసిన పవన్ కల్యాణ్ ఫోటోను ఆమె ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ ఈ ఆసక్తికరమైన కామెంట్ చేసింది. పవన్ శరీర ఛాయను చూసి అసూయపడుతుంటానని రేణు పేర్కొంది. అతనికి ఆ మేని ఛాయ యోగా చేయడంతో పాటు, చక్కని డైట్ ద్వారా సంక్రమించిందని తెలిపింది. అలాగే ఈ ఫోటో తీసినప్పుడు చిత్రంగా ఆయన ఒక కనుబొమ్మను పైకెత్తి పోజు ఇచ్చారని... ఈ ఫోటోను తాను ఎడిట్ చేయలేదని, ఇందులో కనిపిస్తున్న ఆయన శరీర రంగు అసలుదేనని చెబుతూ ట్వీట్ చేసింది.