: ఫిలిప్పీన్స్ కు జపాన్ సాయం...చైనాకు చెక్ పెట్టేందుకే!
దక్షిణ చైనా ప్రాదేశిక జలాల్లో వాటాపై చైనాతో పోరాడుతున్న ఫిలిప్పీన్స్ కు జపాన్ బాసటగా నిలవనుంది. ఫిలిప్పీన్స్ సేనలకు తోడుగా యుద్ధ నౌకలతో పాటు, నిఘా విమానాలను కూడా పంపిస్తామని జపాన్ తెలిపింది. రెండు పెట్రోల్ యుద్ధ నౌకలు, ఐదు నిఘా యుధ్ధ విమానాలు ఫిలిప్పీన్స్ కు పంపిస్తామని జపాన్ ప్రధాని షింజో అబె ప్రకటించారు. దక్షిణ చైనా సముద్రంపై నెలకొన్న వివాదాన్ని ఆ దేశంతో శాంతియుతంగా పరిష్కరించుకోవాలనే నిర్ణయానికి ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డుట్టెరీ, జపాన్ ప్రధాని షింజో అబే వచ్చినట్టు జపాన్ డిప్యూటీ కేబినెట్ చీఫ్ సెక్రటరీ కోయిచి హగుదా తెలిపారు.