: రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిసిన ముస్లిం మతపెద్దలు
భారత సైన్యం చేతిలో హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాది బుర్హాన్ వని హతమైన అనంతరం జమ్ము కశ్మీర్ లో కల్లోల పరిస్థితులు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రంలో పరిస్థితులు ఇప్పుడు కాస్త చల్లబడ్డాయి. ఈరోజు ఆ రాష్ట్ర పరిస్థితులపై చర్చించడానికి కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను ముస్లిం పెద్దలు కలిశారు. కశ్మీర్‌లో నెలకొన్న పలు అంశాలపై వారు రాజ్‌నాథ్ సింగ్‌కు వివరించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ... కశ్మీర్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులని రాజ్‌నాథ్‌సింగ్ చక్కదిద్దుతారన్న నమ్మకం తమలో ఉందని అన్నారు. రాష్ట్రంలో తిరిగి ప్రశాంత వాతావరణం నెలకొంటుందని ఆకాంక్షించారు.