: ఆప్ కు ఎదురుదెబ్బ, అమృతసర్ కార్యవర్గం మూకుమ్మడి రాజీనామా... అంతా సిద్ధూ గూటికి!


పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీలో పెను కలకలం రేగింది. అమృతసర్ పార్టీ ఆఫీసు బేరర్లలో 80 శాతం మంది ఒక్కసారిగా తమ పదవులకు, ఆప్ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ నిరంకుశ విధానాలను తాము వ్యతిరేకిస్తూ రాజీనామా చేసినట్టు వారు చెబుతున్నప్పటికీ, వీరంతా మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ నేతృత్వంలో 9వ తారీఖు నుంచి ప్రారంభం కానున్న 'ఆవాజ్ ఇ పంజాబ్'లో చేరేందుకే ఆప్ ను వీడినట్టు తెలుస్తోంది. మరిన్ని ప్రాంతాల్లో ఆప్ లో కొనసాగుతున్న వారంతా తమ వెనుక రానున్నారని రాజీనామా చేసిన అమృతసర్ ఇన్ చార్జ్ గురిందర్ సింగ్ బజ్వా వ్యాఖ్యానించారు. కాగా, ప్రస్తుతం రాజీనామా చేసిన వాళ్లలో 36 సర్కిళ్లు, 34 సెక్టార్లు, 11 మండలాలకు చెందిన ఆప్ ఇన్ చార్జ్ లు ఉన్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News