: కేంద్రం ఏమిస్తుందో చూసేంత వరకూ మాట్లాడొద్దు: మంత్రులతో చంద్రబాబు


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏమిస్తుందో తెలుసుకున్న తరువాతనే మంత్రులు బహిరంగ వ్యాఖ్యలు చేయాలని, అంతవరకూ మౌనంగానే ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన మంత్రులకు సూచించినట్టు తెలుస్తోంది. ఈ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 గంటల వరకూ ఏపీ క్యాబినెట్ భేటీ జరుగగా, జీఎస్టీ బిల్లుకు ఆమోదం నుంచి రాష్ట్రానికి ఇస్తామంటూ ప్రతిపాదనల్లో ఉన్న కేంద్ర ప్యాకేజీ వరకూ చర్చకు వచ్చినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రత్యేక హోదా లేదా ప్యాకేజీ గురించి కేంద్రం ఏమంటుందో, అందులో ఏఏ అంశాలు ఉన్నాయో ముందుగా తెలుసుకోవాలని, దీనిపై నిర్దిష్టమైన ప్రకటన సాధ్యమైనంత త్వరలో రానుందని గుర్తు చేసిన బాబు, కేంద్ర ప్రకటన వచ్చిన తరువాతే మంత్రులు తమ అభిప్రాయాలను పంచుకోవాలని వెల్లడించారు. కాగా, జీఎస్టీ బిల్లుకు తొలిరోజే ఆమోదం తెలుపుదామని, దానితో పాటు నీరు - చెట్టు కార్యక్రమంలో విద్యార్థులను భాగస్వామ్యం చేస్తూ, వారికి బోనస్ మార్కులు కలపడం, విపక్షాల ఆరోపణలను ఎదుర్కోవడం తదితర అంశాలపైనా బాబు బృందం సమాలోచనలు సాగించింది.

  • Loading...

More Telugu News