: తన ఇంటికి వచ్చిన మిస్టరీ గెస్ట్ ఎవరో చెప్పేసిన సచిన్!


వినాయకచవితి పర్వదినం వేళ, ముంబైలోని సచిన్ టెండూల్కర్ ఇంటికి వచ్చి వినాయకుడికి పూజలు చేసిన మిస్టరీ గెస్ట్ ఎవరన్నది సచిన్ స్వయంగా వెల్లడించారు. నిన్న గణేశ్ విగ్రహం ముందు కూర్చుని ప్రార్థిస్తున్న ఓ వ్యక్తి చిత్రాన్ని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసి, ఎవరొచ్చారో కనుక్కోండంటూ అభిమానులను సచిన్ ప్రశ్నించారు. దీనికి స్పందించిన వేలాది మంది అభిమానులు ఫెదరర్ అని, పాంటింగ్ అని, బ్రెట్ లీ అని సమాధానాలు ఇస్తుంటే, సస్పెన్స్ ను తానే తొలగిస్తూ, పూజలు చేసింది జాంటీ రోడ్స్ అని వెల్లడిస్తూ, యువరాజ్, జాంటీలతో కలసి దిగిన చిత్రాన్ని పోస్ట్ చేశారు. కాగా, భారత సంస్కృతితో అపారమైన అనుబంధం పెంచుకున్న జాంటీ రోడ్స్, తన కుమార్తెకు ఇండియా అని పేరు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక విఘ్నాధిపతి ఆశీస్సుల కోసం ఆయన తన ఇంటికి వచ్చినట్టు సచిన్ తెలిపారు.

  • Loading...

More Telugu News