: అయోధ్యలో రామ మందిరాన్ని కట్టి తీరుతాం!... యూపీ పోల్స్ ముగిసిన తర్వాతే ముందడుగు!: ప్రవీణ్ తొగాడియా
అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించి తీరుతామని చెబుతున్న విశ్వహిందూ పరిషత్ కీలక నేత ప్రవీణ్ తొగాడియా... తాజాగా అదే మాటను పునరుద్ఘాటించినా బాణీ మార్చేశారు. బీహార్ రాజధాని పాట్నాలో నిన్న పర్యటించిన సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు నిజంగానే ఆసక్తికరంగా ఉన్నాయి. ‘‘అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించి తీరుతాం. ఇందులో ఎలాంటి మార్పు లేదు. అయితే ఉత్తరప్రదేశ్ లో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాతే ఈ దిశగా అడుగు ముందుకేస్తాం’’ అని ఆయన వ్యాఖ్యానించారు.