: అన్నవరంలో మాజీ ఎంపీ హర్షకుమార్ అరెస్ట్


తూర్పు గోదావరి జిల్లాలో దివీస్ సంస్థ స్థాపించాలని నిర్ణయించిన పరిశ్రమను వ్యతిరేకిస్తూ నిరసన తెలిపేందుకు బయలుదేరిన మాజీ ఎంపీ హర్షకుమార్, సీపీఎం నేత మధులను అన్నవరంలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా హర్షకుమార్ మాట్లాడుతూ, ప్రజలకు, పర్యావరణానికి తీవ్ర నష్టం జరిపే దివీస్ ను అడ్డుకుని తీరుతామని హెచ్చరించారు. పరిశ్రమ ఏర్పాటు ఆలోచనను నిరసిస్తూ, అఖిలపక్షం ఆధ్వర్యంలో తొండంగి మండలం పంపాదిపేటలో సభకు పిలుపునివ్వగా, అవాంఛనీయ ఘటనలను నివారించేందుకు పోలీసులు భారీగా మోహరించారు. వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న నేతలను అడ్డుకునేందుకు ముందస్తు ప్రణాళికలు వేశారు. అందులో భాగంగానే హర్షకుమార్ తదితరులను అన్నవరంలోనే నిలిపివేశారు. మరోవైపు పంపాదిపేటలో సైతం భారీ ఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి. దీంతో ఈ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

  • Loading...

More Telugu News