: ఉత్తర కొరియాకు పాక్ నుంచి అణు పదార్థాలు!... అమెరికాకు ఫిర్యాదు చేసిన భారత్!


ఇటీవలి కాలంలో ఉత్తర కొరియా విచ్చలవిడిగా అణ్వస్త్ర పరీక్షలు చేస్తోంది. మరి ఆ దేశానికి అంతటి స్థాయిలో అణు పదార్థాలు ఎక్కడి నుంచి సరఫరా అవుతున్నాయి? ఈ విషయంపై శోధన చేసిన భారత గూఢచార సంస్థ రీసెర్చి అండ్ అనాలసిస్ వింగ్ (రా) కీలక అధారాలను సేకరించింది. పాకిస్థాన్ నుంచి సముద్ర మార్గం మీదుగా ఉత్తర కొరియాకు అణు పదార్థాలు సరఫరా అవుతున్నాయని 'రా' అధికారులు నిగ్గు తేల్చారు. ఈ మేరకు ఈ వివరాలతో కూడి ఓ నివేదికను రా అధికారులు అమెరికా దర్యాప్తు సంస్థ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ(సీఐఏ)కు అందజేశారు. పాకిస్థాన్ అటామిక్ ఎనర్జీ కమిషన్... మోనెల్, ఎన్ కోనెల్ అనే రెండు అణుధార్మిక పదార్థాలను ఉత్తర కొరియాకు అందజేస్తోందని, ఇది అమెరికా విధించిన ఆంక్షలకు విరుద్ధమని కూడా ఆ నివేదికలో రా అధికారులు పేర్కొన్నారు. ఈ పదార్థాలను ఉత్తర కొరియాకు అందజేసేందుకు పాకిస్థాన్... చైనా సహకారాన్ని కూడా తీసుకుంటోందట. చైనాకు చెందిన బీజింగ్ సేన్ టెక్ టెక్నాలజీ కంపెనీ లిమిటెడ్ ద్వారానే ఉత్తరకొరియాకు ఈ పదార్ధాలను పాక్ చేరవేస్తోందని కూడా రా అధికారులు నిగ్గు తేల్చారు.

  • Loading...

More Telugu News