: సరబ్ జిత్ ను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం: కేంద్రం
పాకిస్థాన్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్న భారతీయ ఖైదీ సరబ్ జిత్ సింగ్ ను ఇక్కడకు తీసుకొచ్చేందుకు భారత్ ప్రభుత్వం మానవతా కోణంలో అన్ని ప్రయత్నాలు చేస్తుందని విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి ప్రణీత్ కౌర్ తెలిపారు. ముందు అతను కోలుకోవాలని భావిస్తున్నామన్నారు. సరబ్ జిత్ కు కావలసిన వైద్య సహాయాన్ని భారత్ అందిస్తోందని చెప్పారు. గత శుక్రవారం తోటి ఖైదీలు హత్యాయత్నం చేయడంతో తీవ్ర గాయాల పాలైన సరబ్ జిత్ అక్కడి జిన్నా ఆసుపత్రిలో కోమాలో ఉన్నాడు. బతికే అవకాశాలు తక్కువగా ఉన్నాయని వైద్యులు వెల్లడించారు. మరోవైపు సరబ్ జిత్ ను భారత్ పంపించాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.