: నా అశ్లీల సీడీలను లీక్ చేసింది వ్యక్తిగత కార్యదర్శే... పోలీసుల విచారణలో ఆప్ మాజీ మంత్రి!


యువతులతో తాను అశ్లీల భంగిమల్లో ఉన్న సీడీలను తయారు చేసిన తన వ్యక్తిగత కార్యదర్శి ప్రవీణ్ కుమార్, తనను కూడా బ్లాక్ మెయిల్ చేశాడని బహిష్కృత ఢిల్లీ మంత్రి సందీప్ కుమార్ పోలీసుల విచారణలో వెల్లడించినట్టు తెలుస్తోంది. ఈ సీడీలను ప్రవీణ్ పలువురికి పంచాడని ప్రస్తుతం పోలీసు విచారణలో ఉన్న సందీప్ వెల్లడించినట్టు సమాచారం. సందీప్ కు చెందిన రెండు సీడీలు వెలుగులోకి రావడం, వీటిల్లో ఆయనతో ఇద్దరు మహిళలు సన్నిహితంగా ఉన్నట్టు కనిపిస్తుండటంతో, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కల్పించుకుని ఆయన్ను సస్పెండ్ చేయడం తెలిసిందే. ఆపై వీడియోలో కనిపిస్తున్న యువతి, తనకు మత్తుమందిచ్చిన సందీప్ అత్యాచారం చేశాడని కేసు పెట్టడంతో, ఆయన్ను మూడు రోజుల పాటు కస్టడీకి తీసుకున్న పోలీసులు ప్రస్తుతం విచారిస్తున్నారు.

  • Loading...

More Telugu News