: ఫెడెక్స్ రికార్డును బద్దలు కొట్టిన సెరెనా!... గ్రాండ్ స్లామ్ టోర్నీల్లో అత్యధిక విజయాలు నల్ల కలువ పేరిటే!
టెన్నిస్ లో నిన్నటిదాకా రారాజుగా వెలిగిన స్విట్జర్లాండ్ సంచలనం రోజర్ ఫెదరర్ సాధించిన రికార్డులు ఒక్కటొక్కటిగా కనుమరుగు అవుతున్నాయి. ప్రస్తుతం కీలక దశకు చేరుకున్న యూఎస్ ఓపెన్ లో నల్లకలువ సెరెనా విలియమ్స్... ఫెడెక్స్ సాధించిన ఓ రికార్డును బద్దలు కొట్టేసింది. గ్రాండ్ స్లామ్ టెన్సిస్ టోర్నీల్లో 307 విజయాలతో ఫెడెక్స్... అత్యధిక విజయాలు సాధించిన క్రీడాకారుడిగా కొనసాగుతున్నాడు. నిన్న ముగిసిన మ్యాచ్ లో సెరెనా విలియమ్స్ ఆ రికార్డును బద్దలు కొట్టింది. యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ లో యారోస్లావా స్వెదోవాను 6-2, 6-3 స్కోరుతో వరుస సెట్లలో మట్టికరిపించిన సెరెనా... గ్రాండ్ స్లామ్ టోర్నీల్లో అత్యధిక విజయాలు సాధించిన క్రీడాకారిణిగా అవతరించింది.