: కాబూల్‌లో మరోసారి అలజడి.. కాల్పులకు తెగబడ్డ ఇద్దరు దుండగులు
ఆఫ్గాన్ రాజధాని కాబూల్‌లో మరోసారి అలజడి చెలరేగింది. నిన్న కాబూల్‌లో తాలిబన్ ఉగ్రవాదులు జరిపిన జంటపేలుళ్ల ఘటనలో 24 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. మరో 91 మందికి గాయాలయ్యాయి. ఆ పేలుళ్ల ఘటననుంచి తేరుకోకముందే ఈరోజు ఇద్దరు దుండగులు కాల్పులతో రెచ్చిపోయారు. పమ్లారేనా ఛారిటీ సంస్థపై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు ఓ దుండగుడిని మట్టుబెట్టి, మరొకరిని అదుపులోకి తీసుకున్నారు. ఛారిటీ సంస్థపై దాడికి దిగింది ఎవరనే అంశం గురించి వివరాలు అందాల్సి ఉంది.