: ప్రేమను నిరాకరించిన యువతి అశ్లీల ఫోటోలు నెట్ లో పెట్టి బుక్కయిన విజయవాడ యువకుడు!


తన ప్రేమను నిరాకరించిందన్న కోపంతో ఓ యువతి అశ్లీల ఫోటోలను ఇంటర్నెట్ లో పెట్టి అడ్డంగా బుక్కైపోయాడు విజయవాడకు చెందిన ఓ యువకుడు. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, నగరానికి చెందిన మురారి అనే యువకుడు ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. తొలుత అతని ప్రేమను అంగీకరించిన యువతి, ఆపై అతని మనస్తత్వం తెలుసుకుని దూరమైంది. దీన్ని భరించలేని అతను ఆమె చిత్రాలను మార్ఫింగ్ చేసి అసభ్యంగా మార్చి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు. విషయం తెలుసుకున్న బాధితురాలు భవానీపురం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మురారిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కు నెట్టారు. కేసును మరింత లోతుగా దర్యాఫ్తు చేస్తున్నట్టు వెల్లడించారు.

  • Loading...

More Telugu News