: సీఐడీ కార్యాలయంలో భూమన!... తోడుగా వచ్చిన చెవిరెడ్డి, అంబటి!


తూర్పు గోదావరి జిల్లా తునిలో జరిగిన కాపుల సభ సందర్భంగా చోటుచేసుకున్న విధ్వంసానికి సంబంధించిన కేసులో ఏపీ సీఐడీ అధికారుల విచారణకు వైసీపీ కీలక నేత, తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి హాజరయ్యారు. నేటి ఉదయమే తిరుపతి నుంచి బయలుదేరిన ఆయన కాసేపటి క్రితం గుంటూరులోని సీఐడీ కార్యాలయానికి చేరుకున్నారు. భూమన వెంట వైసీపీ కీలక నేతలు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, అంబటి రాంబాబులు కూడా సీఐడీ కార్యాలయానికి వచ్చారు. కాసేపట్లో ఈ కేసులో భూమనను సీఐడీ అధికారులు విచారించనున్నారు.

  • Loading...

More Telugu News