: ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేయడం రాజద్రోహం కిందికి రాదు.. తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు
ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేయడం రాజద్రోహం కిందికి రాదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ‘‘ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేయడం పరువునష్టం కిందికో, రాజద్రోహం కిందికో రాదు’’ అని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. ఈ తీర్పును అనుసరించాల్సిందిగా కోరుతూ ప్రభుత్వ అధికారులు, పోలీసులు, జడ్జిలకు ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ అటువంటి విమర్శలు హింసకు దారితీసినా, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసానికి కారణమైనా అప్పుడు అది రాజద్రోహం కిందకి వస్తుందని స్పష్టం చేస్తూ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఉదయ్ యు లలిత్ ఆధ్వర్యంలోని ధర్మాసనం తీర్పు చెప్పింది. ఈ సందర్భంగా 1962 నాటి కేదార్‌నాథ్ సింగ్, బీహార్ రాష్ట్రాల మధ్య జరిగిన కేసును ఉదహరించింది.