: కౌలాలంపూర్ లో శ్రీలంక రాయబారిపై దాడి!... ఐదుగురు దుండగుల అరెస్ట్!
మలేసియాలో శ్రీలంక రాయబారిపై దాడి జరిగింది. మలేసియా రాజధాని కౌలాలంపూర్ లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో నిన్న జరిగిన ఈ దాడిలో శ్రీలంక రాయబారి ఇబ్రహీం సాహిబ్ అన్సర్ కు స్వల్ప గాయాలయ్యాయి. ఎయిర్ పోర్టులోకి ఎంటరైన అన్సర్ పై గుర్తు తెలియని దుండగులు విరుచుకుపడ్డారు. అన్సర్ పై పిడిగుద్దులు కురిపించిన దుండగులు ఆపై అక్కడి నుంచి పరారయ్యారు. అయితే కాస్తంత ఆలస్యంగా స్పందించిన మలేసియా పోలీసులు ఈ దాడికి సంబందించిన సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఐదుగురు దుండగులను అరెస్ట్ చేశారు. అయితే అరెస్టైన దుండగులు ఏ దేశానికి చెందిన వారన్న వివరాలను కౌలాలంపూర్ పోలీసులు వెల్లడించలేదు. అంతేకాకుండా దాడికి దారి తీసిన కారణాలపైనా వారు నోరు విప్పలేదు.