: తెలంగాణ ఉద్యమ సమయమే టఫ్ టైమ్!... సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంపై రోశయ్య కామెంట్!


తమిళనాడు గవర్నర్ గా పదవీ కాలం ముగించుకున్న సీనియర్ రాజకీయవేత్త, ఉమ్మడి ఏపీకి సీఎంగా వ్యవహరించిన కొణిజేటి రోశయ్య నిన్న హైదరాబాదు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఓ ప్రైవేటు న్యూస్ ఛానెల్ తో తన అనుభవాలను పంచుకున్నారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో తాను పెద్దగా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోలేదని చెప్పారు. అయితే అతి తక్కువ కాలమే తాను సీఎంగా ఉన్న సమయంలోనే తెలంగాణ ఉద్యమం ఎగసిపడిందన్నారు. ఆ సమయమే తన రాజకీయ జీవితంలో తాను ఎదుర్కొన్న గడ్డుకాలం (టఫ్ టైమ్) అని ఆయన పేర్కొన్నారు. మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చేది లేదని ఇప్పటికే స్పష్టం చేసిన రోశయ్య... తన శేష జీవితం హైదరాబాదులోనే కొనసాగిస్తానని ఆయన చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News