: అసెంబ్లీ వ్యూహ రచనే ప్రధానాంశం!... నేడు ఏపీ కేబినెట్ భేటీ!
మూడు రోజుల పాటు జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో వ్యవహరించాల్సిన వ్యూహ రచన రూపకల్పనే ప్రధానాంశంగా ఏపీ కేబినెట్ నేడు భేటీ కానుంది. నేటి ఉదయం 10.30 గంటలకు ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన విజయవాడలో జరగనున్న ఈ సమావేశానికి కేబినెట్ లోని అందరు మంత్రులు పాల్గొననున్నారు. అసెంబ్లీ వ్యూహ రచనతో పాటు రాష్ట్రానికి కేంద్రం ఏమిస్తుందన్న అంశంపైనా చర్చ జరగనున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రత్యేక హోదాకు దాదాపుగా చెల్లుచీటి ఇచ్చేసిన కేంద్రం... ప్రత్యేక ప్యాకేజీ మాత్రమే ఇస్తామన్న ఫీలర్లు వదిలింది. ప్రత్యేక ప్యాకేజీ కూడా ఏ మేర ఉండొచ్చన్న అంశంపైనా కేబినెట్ లో కీలక చర్చ జరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.