: మా ఇంట్లో అమ్మే అన్ని పూజలూ ప్రారంభిస్తుంది... ఆమెను ఫాలో అయిపోతాను!: ఎన్టీఆర్


తమ ఇంట్లో దేవుడ్ని పెద్దగా నమ్మరని, అందుకే తనకు పూజల గురించి పెద్దగా తెలియదని సినీ నటి నిత్యామీనన్ తెలిపింది. 'జనతా గ్యారేజ్' సక్సెస్ మీట్ సందర్భంగా వినాయక చవితి పూజలో పాల్గొన్న అనంతరం ఆమె మాట్లాడుతూ, తాను చేసిన తొలిపూజ వినాయకచవితి పూజ అని చెప్పింది. తానెప్పుడూ దేవుడ్ని 'ఇది కావాలి' అని కోరుకోలేదని చెప్పింది. అందుకే దేవుడు అన్నీ ఇచ్చాడని, ఇచ్చిన ప్రతి దానితో సంతోషంగా ఉన్నానని తెలిపింది. ఇప్పుడు కొబ్బరికాయ కొట్టడం కూడా సరిగా రాదనీ, ఈసారి సరిగా కొడతానని తెలిపింది. జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ, తమ ఇంట్లో అమ్మే అన్ని పూజలు ప్రారంభిస్తుందని, ఆమెను అలా ఫాలో అయిపోవడమే తమ పని అని అన్నారు. చిన్నప్పుడు మావయ్యలు బైక్ లపై తనను తీసుకుని హైదరాబాదు మొత్తం తిప్పేవారని, అన్ని గణేష్ విగ్రహాలను చూసుకుని సాయంత్రానికి ఖైరతాబాద్ గణేష్ ని చూసిన తరువాత ఇంటికి చేరేవారమని గుర్తు చేసుకున్నాడు. అక్కడ కాలనీలో అందరి దగ్గర చందాలు తీసుకుని, ఆ డబ్బులతో ఒక వినాయకుడ్ని పెట్టి డ్యాన్సులు, ఆటలు, పాటలతో సందడి చేసేవారమని గుర్తుచేసుకున్నాడు.

  • Loading...

More Telugu News