: వయసు రీత్యా ఇప్పుడు నేను విశ్రాంతి తీసుకోవడమే ఉత్తమం!: రోశయ్య


ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలంటూ తీవ్రమైన ఉద్యమం నడిచిన రోజుల్లో తాను కళాశాల నుంచి రాజకీయాల్లోకి వచ్చానని తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు వయసు పెరుగుతోందన్న సంగతిని తాను గుర్తించానని ఆయన తెలిపారు. ఇంకా చురుగ్గా రాజకీయాల్లో కొనసాగే శక్తి తనకు లేదని ఆయన చెప్పారు. ఇంకా రాజకీయాల్లో కొనసాగడం కంటే విశ్రాంతి తీసుకోవడం మేలు అని ఆయన పేర్కొన్నారు. తన వయసు రీత్యా విశ్రాంతి తీసుకోవడమే ఉత్తమమని రోశయ్య అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీ పురోభివృద్ధికి ఇప్పుడు సాయపడాలంటే చాలా కష్టమని ఆయన తెలిపారు. పార్టీ ఇప్పుడు ఎదుర్కొంటున్న పరిస్థితి ఇందిరా గాంధీ సమయంలో కూడా ఒకసారి ఎదురైందని, దానిని ఆమె సమర్థతతో అధిగమించారని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇలాంటి పరిస్థితులను అధిగమించగలదని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News