: పైరసీ సినిమాలు ఆన్ లైన్ లో చూడడం నేరం కాదు: బాంబే హైకోర్టు స్పష్టీకరణ


ఆన్‌ లైన్‌ లో పైరసీ సినిమాలు చూడటం నేరం కాదని బాంబే హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. పైరసీ పెరిగిపోయిందని, పైరసీ కారణంగా చాలా నష్టపోతున్నామని ముంబై ఫిల్మ్‌ ప్రొడ్యూసర్ల సమాఖ్య బాంబే హైకోర్టులో కేసు వేసింది. దీనిని విచారించిన జస్టిస్‌ గౌతమ్‌ కుమార్‌ తో కూడిన ధర్మాసనం ఆన్ లైన్ లో పైరసీ వీడియోలు చూడడం నేరం కాదని స్పష్టం చేస్తూనే, వాటిని పబ్లిక్‌ గా చూడడం, డౌన్‌ లోడ్‌ చేసుకుని నిక్షిప్తం చేయడం లేదా ఇతరులకు షేర్‌ చేయడం వంటివి నేరం కిందకి వస్తాయని స్పష్టం చేసింది. పైరసీకి వేదికగా ఉన్న కొన్ని వెబ్‌ సైట్లను బ్లాక్‌ చేయాలని, వినియోగదారులు ఈ సైట్లలోకి వెళ్లేటప్పుడు ఎర్రర్ మెసేజ్ ప్రత్యక్షమయ్యేలా చర్యలు తీసుకోవాలని బాంబే హైకోర్టు ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లకు (ఐఎస్‌పీ) ఆదేశాలు జారీ చేసింది. అలాగే పైరసీ వీడియోలు డౌన్ లోడ్ కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఇలాంటి సమయాల్లో సాధారణ వెబ్ సైట్లు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా చూడాలని సూచించింది. ప్రతి ఐఎస్‌పీ ఒక నోడల్‌ ఆఫీసర్‌ ను నియమించుకోవాలని, వినియోగదారుల సమస్యలను రెండు రోజుల్లో పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించింది.

  • Loading...

More Telugu News